పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే పూజిద్దామని జిల్లా అదనప కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు.మంగళవారం జనగామ పట్టణంలోని నెహ్రూ చౌక్ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సరఫరా చేసిన మట్టి విగ్రహాలను మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ భక్తులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ హితం కోరేందుకు వివిధ ఆకర్షణీయమైన రంగులతో తయారు చేసిన వినాయక ప్రతిమలు పూజలకు వినియోగించరాదని తద్వారా పర్యావరణ పరిరక్షణకు నష్టం వాటిల్లుతుందని అన్నారు.