ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వెల్దుర్తిలో ఆటో కార్మికులు ధర్నా గురువారం నిర్వహించారు. తహశీల్దార్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. షరతులు లేకుండా వాహన మిత్ర పథకం ఇవ్వాలని, డీజిల్–పెట్రోల్-గ్యాస్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి నెలకు రూ.5వేలు సహాయం అందించాలన్నారు.