చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు మండలం ముక్కళత్తూరు పంచాయతీ మిట్ట దళితవాడలో బుధవారం జరిగిన చిన్నపాటి వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ప్రభుత్వ టీచర్ బాలసుబ్రహ్మణ్యం తనపై దాడి చేశాడని ప్రసాద్ ఆరోపించారు. ఈ దాడిలో ప్రసాద్ తలకు గాయం కావడంతో అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.