ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కోటేశ్వరమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రాజు మాట్లాడుతూ గ్రామాలలో ఎటువంటి ఆధారం లేకుండా కట్టుకున్న ఇండ్లకు శాశ్వత గృహపత్రాలను ఇస్తామని అన్నారు. దీంతో ప్రజలు లబ్ధి పొందవచ్చు అన్నారు. గ్రామాలలో ఉన్న ఏ సమస్య నైనా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి ఎంపీటీసీలు సర్పంచులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.