పాలకొల్లు లోని మంత్రి నిమ్మల రామానాయుడు క్యాంపు కార్యాలయంలో పాలకొల్లు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం సందర్భంగా పలు అంశాలపై మంత్రి నిమ్మల రామానాయుడు కు జర్నలిస్టులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త అక్రిడేషన్ కార్డ్స్ ఇప్పించాలని, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించాలని, హెల్త్ కార్డు బెనిఫిట్స్ పునరుద్ధరించాలని ఇళ్ల స్థలాలు, పలు అంశాలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమణ ప్రధాన కార్యదర్శి సాంబశివరావు పాల్గొన్నారు.