కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మూడవరోజు నిరాహార దీక్షను కొనసాగిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆరోగ్య పరిస్థితిని జిల్లా వైద్యాధికారి సీతారాం, డాక్టర్ సాయి వివేక్, డాక్టర్ శ్రవణ్ పరీక్షించారు. పోడు భూముల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు దీక్షను కొనసాగిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలియజేశారు,