ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని పలు శివారు కాలనీలలో ఆదివారం అర్ధరాత్రి ఒంగోలు డి.ఎస్.పి రాయపాటి శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి విజువల్ పోలీసింగ్ నిర్వహించారు. పాత ఖైదీల వివరాలు రౌడీ షీటర్ల వివరాలను ఆధారంగా ఆయా ప్రాంతాలలో నివాసం ఉండే వ్యక్తులు రాత్రి సమయాలలో ఏం చేస్తున్నారు అనే దానిని పరిశీలన చేశారు. వారి కదలికలపై పూర్తి నిగా ఉంచినట్లు కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఆదివారం అర్ధరాత్రి సమయాలలో కొందరు యువకులు గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవిస్తూ నగరంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు దాని నుంచి ఉపశమనం కల్పించేందుకు స్థానికులతో మాట్లాడుతూ ఆయా ప్రాంతాలను సంచరించారు