జిల్లాలోని బూత్ లెవెల్ అధికారులందరికీ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఓటరు దరఖాస్తును మరింత మెరుగ్గా పరిష్కరించే విధానంపై శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.