పాత ఇంటికి మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి యువ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. దేవలచెరువు పంచాయతీ చెన్నుగారిపల్లెకు చెందిన భాస్కర్ రెడ్డి కుటుంబీకులతో కలిసి ఇంటి మరమ్మత్తులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గోడ కూలిపోవడంతో నడుము విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబీకులు అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.