జిల్లాలో ఎండు గంజాయి కలకలం సృష్టించింది. మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీల్లో 500 గ్రాముల ఎండు గంజాయి పట్టుకున్నారు. ఎండు గంజాయిని బీదర్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో SI రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో వాహన తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. గంజాయి సీజ్ చేసి, ఇద్దరిని అరెస్ట్ చేసి కేసునమోదు చేశామని ఎస్సై తెలిపారు.