ఆటో కార్మికులు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద జరుపు తలపెట్టిన ధర్నాకు దళిత హక్కుల పోరాట సమితి మద్దతు ప్రకటిస్తున్నదని శనివారం మధ్యాహ్నం కొండతామరపల్లి జంక్షన్లో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి రేగేటి సంతోష్ తెలిపారు. కొండ తామరపల్లి జంక్షన్లో ఆటో స్టాండ్ కు చెందిన ఏఐటీయూసీ, సీఐటీయూ ఆటో కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ, ఆటో కార్మికులకు ప్రభుత్వం నెలకు 5000 రూపాయల జీవనభృతి ఇవ్వాలని, వాహన మిత్ర పథకం కింద ఇస్తామన్న 15000 ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.