ఈ ఏడాది నిర్వహించే వినాయక చవితి వేడుకల్లో ఎటువంటి అపశృతి జరగకుండా ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు,కమిటీ నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలని జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ పేర్కొన్నారు.అయితే జగ్గంపేట స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిటీ నిర్వాహకులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసిందని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.