కొంతకాలంగా నిలిచిపోయిన సంగపట్నం ఎత్తిపోతల పథకాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత నిధులతో మరమ్మత్తులు నిర్వహించి పునః ప్రారంభించారు. గురువారం సాయంత్రం అవుకు మండల టిడిపి అధ్యక్షులు ఉగ్రసేనారెడ్డి మంత్రి బిసి ఆదేశాల మేరకు అవుకు రిజర్వాయర్ నుండి సంగపట్నం చెరువుకు ఎత్తిపోతల పథకం మోటార్లను ఆన్ చేసి ప్రారంభించారు. 2014 -19 మధ్యకాలంలో అప్పటి ఎమ్మెల్యే, మంత్రి బీసీ ఈ పథకాన్ని తీసుకువచ్చారు.