అనంతపురం నగరంలోని తహసిల్దార్ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న సుమయ్య అనే ఇంజనీర్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.