రైతుల సమస్యలను ప్రశ్నించినందుకు కామారెడ్డి బికేస్ జిల్లా అధ్యక్షుడు ని అరెస్టు చేయడం దారుణమని నాగర్కర్నూల్ జిల్లా బి కే ఎస్ అధ్యక్షుడు అంజన్ రెడ్డి అన్నారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బీకేఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఎరువుల కొరతను అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి పర్యటనలో నిలదీస్తాడని భయంతో కామారెడ్డి జిల్లా బికేస్ అధ్యక్షుడిని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు.