శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో నాయి బ్రాహ్మణ కులస్తుల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. నెల్లూరులో నాయి బ్రాహ్మణ కులస్తులపై పలువురు దాడి చేయడాన్ని ఖండిస్తూ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో నిరసన తెలియజేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. దాడి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించి దాడి చేసిన వారిని శిక్షించాలని కోరారు.