విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. మేతకు వెళ్లిన పశువులు కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు విడుస్తున్నాయి. దిలావర్ పూర్ మండలం కాల్వ తాండ గ్రామానికి చెందిన బానోతు నవీన్ గురువారం ఉదయం ఎద్దులను మేత కోసం తన తోట వైపు తీసుకెళ్లాడు. సమీపంలో తెగిపడి ఉన్నా విద్యుత్ వైర్ ఎద్దుకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఎద్దు విలువ సుమారు రూ. 70 వేల వరకు ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఎద్దు మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు.