ఒక వ్యక్తి కార్నియాతో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించవచ్చునని DMHO జీవనరాణి, జిల్లా అంధత్వ నివారణా కార్యక్రమం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కె.త్రినాధ్ అన్నారు. 40 జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను స్థానిక డిఎంఅండ్‌హెచ్ఓ కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. కళ్లను దానం చేయడం ద్వారా తాము చనిపోయినా, తమ చూపు మాత్రం సజీవంగా ఉంటుందని అన్నారు. నేత్రదానం చేసిన వారు చనిపోయిన తరువాత కళ్లను తొలగించరని, కేవలం పైపొర కార్నియాను మాత్రమే తీసుకుంటారని చెప్పారు.