టీచర్స్ డే సందర్భంగా హోం మంత్రి అనిత ఫేస్బుక్లో పెట్టిన ఓ అధికారిక పోస్టు పట్ల అభ్యంతకర, మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నేతలు కుప్పం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా సామాజిక వర్గాల మధ్య విభేదాలు, మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని ఎమ్మార్పీఎస్ వెల్లడించారు.