తట్ట మట్టి తోలకుండానే వైసీపీ నేతలు రూ.20 లక్షలు స్వాహా చేసారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆరోపించారు. జగనన్న కాలనీ చదును పేరుతో కోర్టు ఉత్తర్వుల ద్వారా వైసీపీ నేతలు బిల్లులు పొందారని మండిపడ్డారు. వైసీపీ నేతలతో అంటకాగిన అధికారులపై చర్యలు తప్పవని అయన హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకుని ప్రతి రూపాయి రికవరీ చేయడంతో పాటు అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముత్తుకురు లో డిమాండ్ చేశారు.