పంజాబ్ రాష్ట్ర ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ఆదుకోవాలని ప్రజా మిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. గురువారం సాయంత్రం 4గంటలకు ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాల వల్ల పంజాబ్ లోని రవి, బియస్, సట్లస్ నదులు పొంగి తొమ్మిది జిల్లాలలో వరదలకు కారణం అయినాయన్నారు. 3లక్షల ఎకరాల వరి సాగు నీట మునిగింది అన్నారు. 2లక్షల 50 వేల మంది నీటిలో ఇరుక్కుపోయారని అన్నారు. దాదాపు 20 వేల పశువులు నది వరదలో కొట్టుకుపోయాయన్నారు.