ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో మంగళవారం వైసీపీ నేతల ఆధ్వర్యంలో రైతు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ భవనం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ర్యాలీగా ఆర్డీవో ఆఫీస్ వరకు వెళ్లి ఆర్డిఓ ను కలిసి వినతి పత్రం అందజేశారు రైతులకు ఎటువంటి ఆటంకం లేకుండా యూరియా మరియు ఇతర ఎరువులను ప్రభుత్వం అందించాలని కోరారు ఎరువుల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని డిమాండ్ చేశారు