పెద్ద కడబూరు:గ్రామీణ ప్రాంతాల్లో ఉల్లి పంటను సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడి పండించిన ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. చేతికొచ్చిన ఉల్లి పంటను రైతులు పీకేందుకు సైతం వెనుకాడుతున్నారు. పెద్దకడబూరు మండలం జాలవాడిలో ఓ రైతు తన ఉల్లి పంటను అలాగే వదిలేసిన సంఘటన చోటు చేసుకుంది. సోమవారం రైతులు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతును ఆదుకోవాలి.