శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు ముప్పిడి సురేష్ తో కలిసి బుధవారం సాయంత్రం లావేరు మండలంలోని తాళ్లవలస గ్రామంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ వారు ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. సుమారు మూడు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేసిన అరబిందో యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రాష్ట్ర మహిళా కార్యదర్శి, అరబిందో యాజమాన్యం పాల్గొన్నారు