మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గోదావరి నదిలో వినాయకుల నిమజ్జనానికి పోలీస్ పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాటుచేసిన ప్రదేశాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. 60 మంది పోలీసులు, ఐదుగురు ఎస్సైలు, ఇద్దరు సీఐల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆయన వెంట సీఐ రమణమూర్తి, ఎస్సైలు తహశీనోద్దీన్, గోపతి సురేష్ ఉన్నారు.