జూలూరుపాడు పంచాయతీలో పడకేసిన పారిశుధ్యం నెలలు తరబడి ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. శాశ్వత పరిష్కారానికి నోచుకోని కొమ్ముగూడెం గ్రామ సమస్యలు కమ్ముగూడెం శాఖ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమస్యల అధ్యయనం సందర్భంగా గ్రామంలో పలు సమస్యలు సిపిఎం బృందం గ్రామ పంచాయతీ ముందు గ్రామ ప్రజలు ఉంచారు సమస్యలు పరిష్కరించాలని కొమ్ముగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం నందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ మాట్లాడుతూ గ్రామంలో సుమారుగా ఏడు నెలల నుండి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మంచినీటి సమస్య ఉందని అన్నారు.