కౌతాళం :మండలం బదినేహాల్ నుంచి ఆదోని వెళ్లే ప్రధాన రహదారిలో వర్షాలతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బదినేహాల్ నుంచి ఆదోనికి ప్రతిరోజూ వెళ్లే వందలాది మంది రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్తున్నట్లు శనివారం తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.