నాటు తుపాకీ కలిగి ఉన్న నాగబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి అతని వద్ద నుండి తుపాకీని స్వాధీన పరుచుకున్నట్లు గోకవరం ఎస్సై పవన్ కుమార్ గురువారం తెలిపారు.గోకవరం మండలంలో జగన్నాధపురం శివారు కోళ్ల ఫామ్ లో ఒక వ్యక్తి వద్ద నాటు తుపాకీ ఉన్నదన్న సమాచారాన్ని తిరుమలయపాలెం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అమలదాసు భాస్కర్ కృష్ణ, పోలీసులకు ఫిర్యాదు మేరకు గోకవరం ఎస్సై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ముద్దాయి యమల నాగబాబుని గురువారం అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించామన్నారు.