ఈజీ మనీ కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతున్నారు. బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్, దొంగతనం ఇలా చెడు దారులను ఎంచుకుంటున్నారు. క్రైమ్ సీన్స్ చూసీ మరీ ప్రిపేర్ అవుతున్నారు. ఇలాంటి సంఘటనే కరీంనగర్‌లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. నగరంలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌లో హైటెక్ దొంగతనానికే పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఓ మహిళ, యువకుడు..ఇద్దరూ బుర్కా వేసుకొని మరీ పక్కా ప్లానింగ్‌తో చోరీకి సిద్ధమయ్యారు. ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ పై మత్తు మందు స్ప్రే చేసి దొంగతనానికి యత్నించారు. ఇంతలో తేరుకున్న ఆ మహిళా కేకలు వేయడంతో సదరు దొంగలు పారిపోయే ప్రయత్నం చేశారు.