వికలాంగుల అర్హులైన పెన్షన్లను కోతపెట్టడం న్యాయమా? అని సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సదరన్ క్యాంప్ సర్టిఫికెట్ల పేరుతో కర్నూలు నగరంలోని పలువురు వికలాంగుల పెన్షన్లను రద్దు చేయడం తీవ్రంగా తప్పుబట్టారు.సీపీఎం సీనియర్ నాయకుడు డి.పార్వతయ్య, నగర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్.ఎం.డి. షరీఫ్ మాట్లాడుతూ… గత వైసీపీ ప్రభుత్వం నుంచి నేటి కూటమి ప్రభుత్వానికి మారినా, దాదాపు 16 నెలలుగా వికలాంగులపై అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. అర్హులైన వారిని కారణం లేకుండా పెన్షన్ల జాబితా నుంచి తొలగించడం దారుణమని మండిపడ్డారు.పెన్షన్లను రద్దు చేసిన ప్రభుత్వాన్ని ఏమనాలా అని ప్రశ్నించిన వారు… వెంట