కోటబొమ్మాలిలోని కొత్తమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహణ, భద్రత ఏర్పాట్లును ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి గురువారం సమీక్షించారు. ఈనెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగారాదని ఎస్పీ పోలీస్ అధికారులు సూచించారు. పార్కింగ్, వీఐపీల భద్రత, క్యూలైన్ నిర్వహణ మొదలగు అంశాలపై ఎస్పీ పలు సూచనలు చేశారు. ఆలయ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.