రైల్వే కోడూరు నియోజకవర్గం లోని పలు మండలాల్లో మంగళ, బుధవారాల్లో 15.6 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. పెనగలూరు మండలంలో 11.6 మిల్లీమీటర్ల వర్షం, చిట్వేల్ మండలంలో 3.6 మిల్లీమీటర్ల వర్షం, పుల్లంపేట మండలంలో 0.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది అని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిక జారీ చేశారు.