తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామంలో కోతుల దాడిలో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చేగుంట గ్రామానికి చెందిన బాలకృష్ణమ్మ గ్రామంలో తన ఇంటి వద్ద ఉండగా కోతుల గుంపు ఆమెపై దాడి చేసి తీవ్రంగ గాయపరిచాయి. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.