సంతమాగులూరు మండలం రామిరెడ్డి పాలెం జాతీయ రహదారి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై ఉన్న భార్య భర్తల్లో భార్య చనిపోగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు వినుకొండ మండలానికి చెందిన కోటేశ్వరమ్మ, తిరుపతి గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.