పామర్రు మండలం నిమ్మకూరులో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎన్టీఆర్ పేరు నమోదవడం పట్ల బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రికార్డు సాధించిన తొలి నటుడిగా ఎన్టీఆర్ గుర్తింపు పొందారని అన్నారు.