కలికిరి మండలం కలికిరి పట్టణంలోని క్రాస్ రోడ్డు కలకడ రోడ్డు వాసుల డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కొరకు కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డి వారి యోగేష్ రెడ్డి మరియు ఈవో జి.అశోక్ శనివారం పనులు చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా కలికిరి మేజర్ పంచాయతీలోని కలికిరి క్రాస్ రోడ్ కలకడ రోడ్డు మార్గంలో డ్రైనేజీ లేకపోవడం వలన ఆ మార్గంలో మురికి నీరు అంతా రోడ్డుపై పారి దుర్గంధ భరితమై ఇటు ప్రయాణికులు, అటు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలోఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు శాశ్వత పరిష్కారంకు మార్గం సుగమం అయింది