ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్ద బోయిలపల్లికి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబ కలహాలతో నాగూర్ కర్నూలు జిల్లాలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకునే ముందు తన ముగ్గురు పిల్లలు మోక్షిత రఘు వర్షిని శివధర్మను తన వెంట తీసుకొని వెళ్ళాడు. తెలంగాణలో జీవనం సాగిస్తున్న వెంకటేశ్వర్లు గత నెల 30వ తేదీన ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటినుంచి పిల్లల ఆచూకీ కూడా కనిపించకపోవడంతో పోలీసులు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.