సిలిండర్ పేలుడు ఘటనలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన 35 వార్డ్ కల్లుపాకలకు చెందిన ఇప్పిలి ఎల్లాజీ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ద్వారా 10 లక్షల రూపాయలు చెక్కును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అందజేశారు. పేలుడు ఘటన దురదృష్టకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. కార్యక్రమంలో సౌత్ టిడిపి ఇన్చార్జ్ శ్రీ సుధాకర్ గారు,స్థానిక కార్పొరేటర్ శ్రీ భాస్కరరావు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ స్టేడియంలో 31 తేదీ జరిగిన సేనతో సేనాని కార్యక్రమం ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించారు.