ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న జి ఆర్ కాలనీ బాధితు కుటుంబాలని ఎమ్మెల్సీలు విజయశాంతి, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, బల్మురి వెంకట్ లు పరామర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు ఆదుకుంటామని ఎమ్మెల్సీలు హామి ఇచ్చారు.. కామారెడ్డి పట్టణంలో ఇలాంటి విపత్తు రావడం చాలా బాధాకరం అన్నారు.