అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వినాయకుని మంటపాలవద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. గురువారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో, నిర్దేశిత రూట్లలోనే వెళ్లి నిమజ్జనాలు చేపట్టాలని తెలిపారు.