రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ముందు చూపు లేదని వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువులు, విత్తనాల కొరత తీవ్రంగా ఉందని, యూరియాను బ్లాక్ మార్కెట్‌లో రూ.350-400కి అమ్మే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు వైఎస్ఆర్సిపి పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.