సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బిజెపి సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా వేసుకున్నారు. సిర్పూర్ నియోజకవర్గం నుండి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు వెంకటేశం పలువురు బిజెపి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నారు,