ప్రకాశం జిల్లా కొమరోలు ఎస్సై నాగరాజు ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయని అటువంటి ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కొమరోలు పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన ఎస్సై నాగరాజు.. ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. వర్షాలు కురిసిన నేపథ్యంలో విద్యుత్ స్తంభాల వైపు లేదా పొలం మోటర్లు వేసే రైతులు జాగ్రత్త వహించాలన్నారు. తమ పిల్లలు చెరువులు వాగులు కుంటలలో ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.