నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంత జుటూరు గ్రామంలోని ఓ మెడికల్ షాప్, RMP డాక్టర్ నిర్వహిస్తున్న ప్రథమ చికిత్సా కేంద్రాన్ని నారాయణపురం పీహెచ్సీ డాక్టర్. దినేష్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. స్టెరాయిడ్స్కు సంబంధించిన ఇంజక్షన్లు, టాబ్లెట్స్ పరిశీలించారు. డాక్టర్ వేస్తున్న ఇంజక్షన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటూ ఆరా తీశారు. ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదిక పంపిస్తామని డా. దినేష్ కుమార్ వెల్లడించారు.