తన కూతురు సుగాలి ప్రీతి హత్య కేసులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ హామీని విస్మరించారని ప్రీతి తల్లి పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆమె మాట్లాడారు. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని, గవర్నర్ను కూడా కలుస్తానని తెలిపారు. జనసేన కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని ఆమె ప్రకటించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు.