శ్రీ సత్యసాయి జిల్లా రొద్దంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వెనుక భాగంలో నిర్వహిస్తున్న బ్రాందీ షాపును తొలగించాలని బహుజన చైతన్య వేదిక తోపాటు కేవీపీఎస్ నాయకులు గురువారం మధ్యాహ్నం ఆర్డీవో ఆనంద్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపకులు శివరామకృష్ణ, నాయకులు వెంకటేష్, బాబు గంగప్ప ఈశ్వర్ పాల్గొన్నారు.