Parvathipuram, Parvathipuram Manyam | Aug 29, 2025
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని తెలగడవలసలో వినాయక మండప వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యాధికారి డి శ్రీనివాసరావు 160మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ వినాయక పూజలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.