ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి లోని హేలాపురి టౌన్షిప్ కు చెందిన యార్లగడ్డ రాఘవేంద్రరావు హెచ్ఎం గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు గత కొద్ది రోజులుగా సైబర్ నేరగాళ్లు ఆయనకు ఫోన్ చేసి దేశద్రోహ చర్యలకు పాల్పడ్డారని అరెస్ట్ వారెంట్ వచ్చిందని మోసపూరిత మాటలు చెప్పి దఫా దఫాలుగా 42.5 లక్షల రూపాయలను కాజేశారు శుక్రవారం రాత్రి ఆయన రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.