మచిలీపట్నం లో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు శుక్రవారం మచిలీపట్నంలో మాట్లాడుతూ, వైసిపి ఎంత దుష్ప్రచారం చేసినా బీసీలు తెలుగుదేశం పార్టీకే వెన్నుదన్నుగా ఉంటారని అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వైసిపి ఒక వ్యక్తిగత తగాదాను పార్టీ తగాదాగా చిత్రీకరించాలని చూస్తోందని, అయితే టీడీపీ రజకులకు, బీసీలకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.