అల్పపీడన ప్రభావంతో ఏలూరు జిల్లా నూజివీడు, లింగపాలెం, కొయ్యలగూడెం, చింతలపూడి, బుట్టాయిగూడెం, దెందులూరు మండలాల్లోని పలు ప్రాంతాలలో బుధవారం సాయంత్రం 4గంటలకు భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిరువ్యాపారులు, వాహనదారులు, పాదచారులు అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం వరకు అధిక ఎండతో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందామన్నారు. మెట్ట ప్రాంత పంటలకు ఈ వర్షం ఊతమిస్తుందన్నారు.